గుర్తుతెలియని లారీ ఢీకొని ఇద్దరు మృతి…
పటాన్ చెరు:
గుర్తుతెలియని లారీ ఢీకొని బైక్ పై వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు…. నగరంలోని కొండాపూర్ కు చెందిన నర్సింగ్ రావు (36) ,విజయ్ (23)లు బుధవారం బైక్ పై సంగారెడ్డి వెళ్లి తిరిగి పటాన్ చెరు వైపు వస్తుండగా మండల పరిధిలోని లక్దారం గేటు వద్ద మహారాష్ట్రకు చెందిన గుర్తుతెలియని లారీ వెనకాల నుండి వేగంగా వచ్చి ఢీకొనడంతో బైక్ నుంచి ఇద్దరు కింద పడడంతో లారీ టైరు ఇద్దరు తలల పైనుంచి వెళ్లడం తో తలలు పగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరినీ పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బంధువుల ఫిర్యాదు మేరకు సీఐ వేణుగోపాల్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.