Telangana

రైతుల‌ కోసం త్రివేణి విద్యార్థుల విరాళo సేకరణ గవర్నర్ తమిళ సైకి aఅందజేసిన సంస్థ అధినేత . వీరేంద్ర చౌదరి…

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతుల సహాయార్థం ప్రధాన మంత్రి సహాయ నిధికి త్రివేణి ఎడ్యుకేషనల్ విద్యార్థులు‌ జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్షా నూట‌ పదహారు రూపాయల విరాళాన్ని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కి అందజేశారు. త్రివేణి డైరెక్టర్ డా వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ 23 న దేశవ్యాప్తంగా భారతదేశ 5వ ప్రధానమంత్రి, భారతదేశపు రైతుల విజేతగా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. తమ విద్యాసంస్థలో విద్యనభ్యసించే చిన్నారులు రైతులకోసం విరాళాలు సేకరించి గవర్నర్ కు అందజేయడం జరిగిందన్నారు. రైతు చేతులు భూమి లోకి వెళ్తేనే, మన వేళ్ళు నోటిలోకి వెళతాయని, రైతును కాపాడుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులను, ప్రోత్సహించిన త్రివేణి స్కూల్స్ డైరెక్టర్ డా. వీరేంద్ర చౌదరి ని, మార్గం చూపిన ఉపాధ్యాయ బృందాన్ని, విరాళాలను అందచేసిన విద్యార్థులను గవర్నర్ తమిళ సై సత్కరించారు. విద్యార్థులకు పుస్తకాలు బహుకరించి, అభినందించారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

6 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

6 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

6 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

6 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

6 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago