మన వార్తలు ,శేరిలింగంపల్లి :
స్వతంత్ర భారత తొలి హోంమంత్రిగా మరియు తొలి ఉప ప్రధానమంత్రిగా దేశాన్ని ఐక్యం చేసి మనలో సమైక్య స్ఫూర్తిని నింపిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించిన బీజీపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, రాధా కృష్ణ యాదవ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆంగ్లేయులు మత ప్రాతిపదికన దేశాన్ని రెండు ముక్కలు చేశారు. అలాగే వెళ్తూ వెళ్తూ దేశంలోని సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కూడా కట్టబెట్టారు.
దీని ప్రకారం తమకు నచ్చితే సంస్థానాధీశులు భారత్ యూనియన్‌లో కలవచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. ఈ సమస్యను తనదైన శైలిలో పరిష్కరించి ఇండియన్ బిస్మార్క్‌గా వల్లభాయ్ పటేల్ మన్ననలు అందుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోపాల కృష్ణ , ఆంజనేయులు సాగర్, లక్ష్మణ్ ముదిరాజ్, బాలాజీ, గణేష్ ముదిరాజ్, మధు యాదవ్, రవి నాయక్, పద్మ, రేణుక ,మల్లిక, నరసింహ, సాయి,శీను, రాము మొదలగు వారు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…