మొబైల్ రోబోట్లపై గీతం విద్యార్థులకు శిక్షణ

Telangana

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

రోబోటిక్స్, ఆటోమేషన్ లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై విద్యార్థులకు ఆచరణాత్మక అవగాహన కల్పించేందుకు, గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ హైదరాబాదులోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం స్వయం ప్రతిపత్తి గల మొబైల్ రోబోట్లపై రెండు రోజుల స్వీయ అనుభవం గడించే కార్యశాలను విజయవంతంగా నిర్వహించింది.

ఈ వర్కుషాపులో సుమారు 70 మంది విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. ముఖాముఖి శిక్షణతో పాటు ఆచరణాత్మక ప్రదర్శనల ద్వారా విలువైన అనుభవాన్ని పొందారు. ఆసక్తికరమైన చర్చలు, ప్రశ్న-జవాబు కార్యక్రమాల ద్వారా, స్వయం ప్రతిపత్తి గల మొబైల్ రోబోటిక్స్ పై తమ అవగాహనను మరింత పెంచుకోవడానికి, అలాగే తమ సాంకేతిక సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఈ కార్యశాలలో పాల్గొనవారికి అవకాశం లభించింది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న రోబోటిక్స్, ఆటోమేషన్ రంగంలో ఇది విలువైన అంతర్దృష్టులను అందించిందని పేర్కొంటూ, ఇందులో పాల్గొన్నవారు ఈ కార్యశాల యొక్క ఆచరణాత్మక, పరిశ్రమకు సంబంధించిన విధానాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా పొందిన జ్జానం, నైపుణ్యాలు తమ కెరీర్ అవకాశాలను విస్తృతం చేసుకోవడానికి, ఈ రంగంలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలకు అనుగుణంగా తమను తాము సిద్ధం చేసుకోవడానికి సహాయపడతాయని కూడా వారు తెలిపారు.గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ వడ్డి, మెకానిక్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ జయప్రకాష్ శ్రీవాస్తవల పర్యవేక్షణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ. కిరణ్ కుమార్ ఈ కార్యశాలను సమన్వయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *