పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శనివారం సాయంత్రం 6 గంటలకు పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో నిర్వహించ తలపెట్టిన మహాశివరాత్రి మహా జాగరణ, స్వర లింగోద్భవ కార్యక్రమాల ఏర్పాటును పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. జాగరణకు హాజరై భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులందరూ సాయంత్రం 6 గంటల లోపు మైత్రి గ్రౌండ్స్ కు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవితలు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారని తెలిపారు.అనంతరం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు పురస్కరించుకొని ప్రముఖ గాయకుడు గద్దర్ నరసింహ ఆలపించిన గీతాలను ఆయన ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పరమేష్ యాదవ్, ప్రమోద్ గౌడ్, మెరాజ్ ఖాన్, చెన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.