పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ ఎస్ ) లోని ఫైన్ అండ్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ స్వరకర్త త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, జీఎస్ హెచ్ ఎస్ డైరక్టర్ సన్నీ గోస్మాన్ జోస్ జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ, మనోహరమైన ప్రదర్శనల పట్ల తన హర్షాతిరేకాలను వెలిబుచ్చారు. త్యాగరాజ పంచరత్న కృతులలోని అద్భుతమైన రాగాలతో ప్రేక్షకులను లీనం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఆనంద మురళి, శ్వేత ప్రసాద్, కె.చంద్రరావు, లాస్య ప్రియ, మనోజ్ఞ, జ్యోతర్మయిల మృదు మధుర గాత్రానికి జీఎస్ హెచ్ ఎస్ అధ్యాపకులు డాక్టర్ వైలలితా సింధూరి, డాక్టర్ సింధూజ, యోషిత బుద్ధ (కూచిపూడి), డాక్టర అక్షయ జనార్దన్ (భరతనాట్యం), డాక్టర్ మెథైలి అనూస్ (మోహినీయాట్టం)ల నృత్య ప్రదర్శనలు తోడే సంగీత కచేరీ ఆహుతులందరినీ విశేషంగా అలరించింది. చప్పట్లతో ప్రాంగణమంతా ప్రతిధ్వనించింది.వాయిద్యకారులు ఐ.ఏ. రేణుకా ప్రసాద్, టీ.పీ.బాలసుబ్రహ్మణ్యం (మృదంగం), కేఎల్ఎన్ మూర్తి (వయొలిన్), ఆనంద మురళి (గానం) తో సహకారం అందించారు. త్యాగరాజ స్వరకల్పనల అందం, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ సాగిన ఈ ఆరాధన విజయవంతంగా ముగిసి, ప్రేక్షకులకు ముధురానుభూతిని మిగిల్చింది.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…