పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని బీ.ఆర్క్. తొలి ఏడాది విద్యార్థిని ఆశ్రిత రాజు తెలంగాణ ముఖ్యమంత్రి కప్ 2025-26 పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటి మూడు బంగారు పతకాలను గెలుచుకుంది. సీఎం కప్ రెండో ఎడిషన్ తుది దశ పోటీలను ఫిబ్రవరి 20-21 తేదీలలో హైదరాబాదులోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో నిర్వహించారు. పికిల్ బాల్ ఉమెన్స్ సింగిల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ పోటీలలో ఆశ్రిత నెగ్గి మూడు బంగారు పతకాలను కైవసం చేసుకుంది.ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంటును తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ జనవరి 8 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఈ ఛాంపియన్ షిప్ లో హ్యాండ్ బాల్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బిలియర్డ్స్, ఫెన్సింగ్, లాన్ టెన్నిస్, పికిల్ బాల్ వంటి పోటీలను బహుళ-స్థాయి ఫార్మాట్ లో జరుపుతున్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రారంభమై, తరువాత మండల, పట్టణ స్థానిక సంస్థల రౌండ్లను నిర్వహించారు. చివరిగా హైదరాబాదులో రాష్ట్ర స్థాయి ఫైనల్స్ నిర్వహిస్తున్నారు.ఆశ్రిత రాజు సాధించిన అద్భుతమైన విజయానికి గీతం నాయకత్వం అభినందనలు తెలియజేసింది. గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ తదితరులు ఆమె అంకితభావం, క్రమశిక్షణ, క్రీడా నైపుణ్యాలను ప్రశసించారు. భవిష్యత్తు పోటీలలో కూడా గొప్ప మైలు రాళ్ల కోసం కృషిచేయాలంటూ ఆమెను ప్రోత్సహించారు.గీతం కమ్యూనిటీ ఈ విజయం పట్ల అపారమైన గర్వాన్ని వ్యక్తం చేసింది. ఇటువంటి విజయాలు విద్యా నైపుణ్యంతో పాటు క్రీడా స్ఫూర్తి, జట్టు కృషి, సమగ్ర అభివృద్ధిని పెంపొందించడంలో విశ్వవిద్యాలయం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తాయని పేర్కొంది.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…