పటాన్చెరు :
గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ హైదరాబాద్-విశాఖపట్టణాలు సంయుక్తంగా ‘అస్తిత్వ’ పేరిట ఒకరోజు థీసిస్ లెవీ వర్క్ షాప్ ఫిబ్రవరి 27న (శనివారం) ఉదయం 8.00 నుంచి 11.00 గంటల మధ్య నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఆర్కిటెక్చర్‌ను తమ కెరీర్ ఎంపిక చేసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఈ కార్యశాలలో పాల్గొనవచ్చన్నారు.ఆర్కిటెక్ట్, పరిశోధన, డిజెన్, ప్రాజెక్టు మేనేజ్మెంట్లలో అమితాసక్తి ఉన్న ప్రియా భట్కర్ ఈ సెమినార్లో ముఖ్య వక్తగా పాల్గొంటారని ఆయన తెలియజేశారు.ఔత్సాహిక విద్యార్థులు, ఇతర వివరాల కోసం అసోసియేట్ ప్రొఫెసర్ కె.నాగేశ్వరరావు (98666 19639)ను సంప్రదించాలని లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్నిగ్ధా రాయ్ sroy2@gitam.eduకు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.
