_విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన జిఎంఆర్ ఓపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు పోటీలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిసాయి. ముగింపు కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని పోటీలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
