కేసీఆర్ కోటలో హస్తం హవా
మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం
గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తూ మెజార్టీ స్థానాలలో జయకేతనం ఎగురవేయడం సంతోషకారమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.బుధవారం మెదక్ పార్లమెంటు పరిధిలోని సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్ లు, జిల్లా సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడిగా ఎన్నికైన మన్నె కళ్యాణ లు గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తో కలిసి నీలం మధు ను చిట్కుల్ ఎన్ఎంఆర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా విజయకేతనం ఎగురవేసిన సర్పంచ్ లను, ఉపసర్పంచ్లు, వార్డ్ సభ్యులను ఆయన అభినందించి ఘనంగా సత్కరించారు.
అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ గజ్వెల్ లో కాంగ్రెస్ తో నే అభివృద్ధి సాధ్యమని నమ్మి ప్రజలు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు పట్టం కట్టారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తో పాటు కాంగ్రెస్ శ్రేణులు కృషి మరువలేనిదని కొనియాడారు. నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటు గ్రామాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మనోహరబాద్ గ్రామ సర్పంచ్ భాస్కర్ యాదవ్, జీడిపల్లి గ్రామ సర్పంచ్ నర్సన్న గారి కృష్ణ, కొండాపూర్ గ్రామ సర్పంచ్ నూకల రాము, వెంకటాపూర్ అగ్రహారం గ్రామ సర్పంచ్ వెంకటేష్, గౌతజిగూడా గ్రామ సర్పంచ్ నాగరాజు , ఉప సర్పంచ్ ఎర్ర నాగరాజు, సర్పంచులు, ఉపసర్పంచ్లు, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
