Telangana

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ :

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో పదవ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని సంపూర్ణ విశ్వాసంతో పరీక్షలు రాయాలని కోరారు. గత దశబ్ద కాలంగా నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులకు సొంత నిధులతో పరీక్ష సామాగ్రి తో పాటు మోటివేషనల్ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ ప్రజా ప్రతినిధులు కృష్ణ, గోపాల్, ఉపేందర్ రెడ్డి, రాములు, బిజీలీ రాజు, నాయకులు శ్రీకాంత్, దాసు, చంద్రశేఖర్, జ్ఞానేశ్వర్, యాదగిరి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సోమ్ల నాయక్, క్షత్రియ యూత్ ఫెడరేషన్ ప్రతినిధులు రాజు, ప్రశాంత్ వర్మ, రాము, రామరాజు, కె వి ఎస్ ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

4 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

2 days ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago

లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు…

3 days ago