సమాజంలో న్యాయవాది పాత్ర కీలకమైనదని..

politics Telangana

– టీఎస్ లా సెట్ కన్వీనర్ ఓయూ, డీఎన్( ఫ్యాకల్టీ ఆఫ్ లా) విజయలక్ష్మి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సమాజంలో న్యాయవాది పాత్ర కీలకమైనదని టీఎస్లా సెట్ కన్వీనర్ ఓయూ, డీఎన్( ఫ్యాకల్టీ ఆఫ్ లా) విజయలక్ష్మి అన్నారు.పటాన్‌చెరు మండలం ముత్తంగి లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో విశ్వ భారతి న్యాయ కళాశాల మొదటి,రెండో సంవత్సర విద్యార్థులు ఫైనల్ఇయర్ విద్యార్థులకు ఇచ్చిన వీడ్కోలు సమావేశానికి లా సెట్ కన్వీనర్, ఓయూ డీఎన్ విజయలక్ష్మి, ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్, చైర్మన్ బీఓఎస్ రామ్ ప్రసాద్,విశ్వభారతి లా కళాశాల కరస్పాండెంట్ రవి అనంత లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల తో కలసి విశ్వభారతి లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భవాని జ్యోతి ప్రజ్వలన చేయించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి కరస్పాండెంట్ రవి అనంత తన తల్లి జ్ఞాపకంగా అనంత రాజమ్మ మెమోరియల్ పేరు మీద బంగారు పతకం అందించనున్నట్లు తెలిపారు.

అనంతరం టీఎస్ లా సెట్ కన్వీనర్ విజయలక్ష్మి మాట్లాడుతూ. న్యాయం చేసే సమయంలో న్యాయవాది పాత్రను ఆమె వివరించారు. న్యాయ వృత్తి ద్వారా ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు. న్యాయవాది, న్యాయమూర్తి గానే కాకుండా ఏ రంగంలోనైనా దీంతో ఎదగవచ్చని ఆమె తెలిపారు. లా లో ఎంతమంది చేరాలనుకుంటే అంతమంది చేరవచ్చని దరఖాస్తులు ఇస్తున్నారని, అలాగా ఆన్ లైన్ విధానం ద్వారా కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. లాలో చేరితే సమాజానికి లాభం ఉంటుందని, మనం కొద్దో గొప్పో అందరికీ మేలు కలిగించిన వాళ్ళం అవుతామని ఆమె చెప్పారు. న్యాయవాద వృత్తి అంటేనే అట్లాంటిదని అన్నారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ రాంప్రసాద్ మాట్లాడుతూ.ముందుండి సహాయం చేసే అవకాశం అది ఒక్క లాయర్ కే ఉందన్నారు. అదేవిధంగా లా విద్యార్థులకు పలు సలహాలు,సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో విశ్వభారతి లా కలశాల అధ్యాపకులు గురుమూర్తి, వర్ష ,రమ్య, కీర్తి, అన్వి, పూనం, తేజశ్రీ, లా కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *