మనవార్తలు , పటాన్ చెరు:
చత్రపతి శివాజీ స్ఫూర్తి ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు మరాఠా మహావీరుడు చత్రపతి శివాజీ 348 వ జయంతి సందర్భంగా చిట్కుల్ నుంచి ఇస్నాపూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం చిట్కుల్ గ్రామంలో శివాజీ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ గొప్ప పోరాటయోధుడు గానే కాకుండా గొప్ప పరిపాలనాదక్షుడుగా శివాజీ పేరు పొందారని ,హిందూ సంస్కృతి హిందూ ధర్మం కోసం శివాజీ కృషి చేశారని,చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు సమర్థవంతమైన పాలనతో శివాజీ తన రాజ్యాన్ని విస్తరింప చేశాడని తెలిపారు. దేశ చరిత్రలో శివాజీ కి సముచిత స్థానం ఉందని ,నియోజకవర్గ పరిధిలోని ముఖ్య ప్రాంతాలలో శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు Nmm యువసేన భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.