ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రంగోలి, కైట్ ఫెస్టివల్

politics Telangana

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి

పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పర్వదినం అని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని బుధవారం ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన రంగోలి, కైట్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా పటాన్చెరు కేంద్రంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం పట్ల ఎం డి ఆర్ ఫౌండేషన్ ను అభినందించారు. తన బాల్యంలో సంక్రాంతి వచ్చిందంటే పండగ ముందు పండగ తర్వాత గాలిపటాలు ఎగురవేస్తూ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే వారమని నేటితరం సెల్ ఫోన్, సోషల్ మీడియా మాయలో పడి మన సంస్కృతి సాంప్రదాయాలను మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని కాపాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, ఎం డి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పృథ్వీరాజ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *