politics

గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ ఉద్యోగుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

_ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :దేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా నూతన పే స్కేల్ ను చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా.. పటాన్చెరు నియోజకవర్గ సెర్ప్ ఉద్యోగుల ఆధ్వర్యంలో పటాన్చెరువు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ప్రభుత్వ రంగంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ ఉండకూడదన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టర్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడంతో పాటు, లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక అభ్యున్నతిని సాధించడంలో సెర్పు ఉద్యోగుల పాత్ర కీలకమైనదన్నారు. నూతన పే స్కేల్ అమలు చేసి వారి జీవితాల్లో నూతన వెలుగులు నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఆయా మండలాల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు శ్రీనివాస్, శివకుమార్, నరేందర్, మధులత, తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

9 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

11 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago