అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…
పటాన్ చెరు:
నియోజకవర్గ పరిధిలోని గ్రామాల మధ్య అనుసంధాన రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలో కోటి 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నందిగామ నుండి బానూరు వరకు నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేయనున్న ఆర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు నిర్మించడం ద్వారా దూర భారం తగ్గడంతోపాటు అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతాయని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఇప్పటికే గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉమావతి గోపాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.