విద్యార్థుల భ‌విష్య‌త్ ను దెబ్బ‌తీసే నిర్ణ‌యాల‌ను ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకోవాలి : బీఆర్‌ఎస్‌వీ నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షులు చెన్నారెడ్డి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన శ‌క్తి స్కీమ్ , జీవో నెంబ‌ర్ 97 ను ర‌ద్దు చేయాల‌ని బీఆర్ఎస్వీ డిమాండ్ చేసింది. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ అధ్యక్షులు కమ్మెట చెన్నారెడ్డి ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ క‌ళాశాల విద్యార్థుల‌తో క‌లిసి ఆందోళ‌న నిర్వ‌హించారు .జీవో నెంబ‌ర్ 97ను వెంటనే రద్దు చేసి, పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి స్కీమ్‌లో విలీనం చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.క‌ళాశాల ఎదుట విద్యార్థులు నిర‌స‌న చేప‌ట్టి చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శక్తి డౌన్  డౌన్   జీవో-97 రద్దు చేయాలి  “పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి” అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు . ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకులు మేరాజ్ ఖాన్, భరత్, గుమ్మడిదల మండల బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షులు రాము, నర్సింహాచారి, సోయల్ ఖాన్, రాజు, యశ్వంత్, రామకృష్ణ, సురేష్, ముజీత్, వసీం, బీఆర్‌ఎస్‌వీ మహిళా నాయకురాలు మనీషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *