Telangana

పోరాటయోధుడు పండగ సాయన్న నీలం మధు ముదిరాజ్

భూస్వాములకు రజాకర్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటం మర్చిపోలేనిది 

ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం 

సొంత నిధులతో పండగ సాయన్న విగ్రహం 

రాయిని పల్లి లో విగ్రహావిష్కరణ కార్యక్రమం

భారీ బైక్ ర్యాలీ,మంగళ హారతులతో స్వాగతం పలికిన గ్రామస్థులు 

తెనుగోలా సాయన్న ను ఊరూరా ప్రతిష్టించి తెలంగాణ సాయన్నగా తీర్చిదిద్దుదాం 

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నిజాం రజాకర్లకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజల కడుపు నింపిన పోరాటయోధుడు పండగ సాయన్న అని నీలం మధు ముదిరాజ్ అన్నారు. వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పాన్ గల్ మండలం రాయిని పల్లి గ్రామంలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన పండగ సాయన్న విగ్రహాన్ని ఆయన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారితో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూపేద ప్రజలు ఆకలితో అలమటించకూడదని భూస్వాముల నుంచి ఆహార ధాన్యాలు దోచి పేద ప్రజల కడుపు నింపిన మహనీయుడని కొనియాడారు. ఆకలితో అల్లాడుతున్న గ్రామాలలో పండగ సాయన్న అడుగు పెడితే వారి కడుపు నింపి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన ఘనత వల్లే సాయన్న కు పండగ సాయన్న పేరు వచ్చిందన్నారు. ఈ మహానీయుడు బంధుక్ ఎత్తి రజాకర్ల అన్యాయాలను ఎదిరించి ఎదురొడ్డి నిలిచి బహుజనులకు అండగా నిలిచాడని గుర్తు చేశారు. అలాంటి మహావీరుడు స్ఫూర్తితో భవిష్యత్తు తరాలు పోరాటాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.పండగ సాయన్న సేవలను భావితరాలకు తెలియజేయాలని సంకల్పంతో పండగ సాయన్న విగ్రహలను ఊరూరా నెలకొల్పుతామని తెనుగోలా సాయన్న ను తెలంగాణ సాయన్నగా తీర్చిదిద్దుతాం అని అన్నారు. ఈ సందర్భంగా పలువురు పాలమూరు యూనివర్సిటీ కి పండగ సాయన్న పేరు పెట్టేలా చూడాలని ఆయన దృష్టికి తీసుకుని రాగా అందుకు సానుకూలంగా స్పందించిన నీలం మధు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి అయ్యే విధంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో డా పగిడాల శ్రీనివాసులు, బెక్కం జనార్ధన్, పండగ సాయన్న వారసులు యాదయ్య,నర్సింలు, సభాధ్యక్షులు శివ ప్రసాద్, దర్గేష్,నాయకులు మమత గౌడ్, పెబ్బేటి మల్లికార్జున్, వెంకటస్వామి,వాకిటి ఆంజనేయులు, చెన్న రాములు, పుట్ట బలరాజు, మెట్టుకాడి శ్రీనివాస్,కృష్ణ, పండగ సాయన్న విగ్రహ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago