ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత
రుద్రారం, పాశంమైలారం, చిట్కుల్ వార్డుల్లో రూ.2.70 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం, పాశం మైలారం, చిట్కుల్ వార్డుల్లో సుమారు రూ.2.70 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగు నీటి కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.మున్సిపాలిటీలోని ప్రతి వార్డును సమానంగా అభివృద్ధి చేయడంతో పాటు, కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తూ ఇస్నాపూర్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుమలత శ్రీకాంత్, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, గాయత్రి పాండు, కౌన్సిలర్లు పాండు, సంధ్య నవీన్ రెడ్డి, లత వెంకటేష్, రాజు, ఆంజనేయులు, వెంకటేష్, అరుణ్, కో ఆప్షన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, బాబా, అసీయ బేగం, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి, కృష్ణ, రాజు, బండ రాజు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…