నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్
అమీన్పూర్
బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట అవుటర్ రింగ్ రోడ్డు వరకు నిర్మిస్తున్న వందఫీట్ల రహదారి పనులు పూర్తి కావచ్చాయని, అతి త్వరలో రహదారిని ప్రారంభించనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ లతో కలిసి రహదారి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా 50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వంద ఫీట్ల రహదారి నిర్మిస్తున్నట్లు తెలిపారు. రహదారి నిర్మాణం పూర్తయితే ఇటు అమీన్పూర్ మున్సిపల్ తో పాటు అటు అమిన్ పూర్ మండల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకునేలా విమర్శలు చేయకుండా గుణాత్మకమైన సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ డి ఈ దీపక్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…