బొల్లారంలో వంద శాతం వ్యాక్సినేష‌న్ కుస‌హకరించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు -కొలన్ రోజా బాల్ రెడ్డి

politics

బొల్లారం

కోవిద్ వ్యాక్సినేష‌న్ వంద శాతం విజ‌య‌వంతం చేయ‌డంలో వైద్య సిబ్బంది సేవ‌లు అభినందనీయ‌మ‌ని మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్స‌న్ కొల‌న్ రోజా బాల్ రెడ్డి అన్నారు .సంగారెడ్డి జిల్లా జిన్నారం మండ‌లం బొల్లారం మున్సిపాలిటీలో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వందం శాతం పూర్తి చేసిన వైద్య సిబ్బందిని ఘ‌నంగా స‌న్మానించారు. నిరంత‌రం వ్యాక్సినేష‌న్ విజ‌య‌వంతంకు కృషి చేసిన ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్ న‌ర్స్ స్వ‌రూప రాణిని , ఆశా వ‌ర్క‌ర్లను , అంగ‌న్ వాడీ సిబ్బంది సేవ‌ల‌ను మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్స‌న్ కొల‌న్ రోజా బాల్ రెడ్డి క‌మిష‌న‌ర్ రాజేంద్ర కుమార్ లు ప్ర‌శంసించారు.వంద శాతం పూర్త‌యిన సంద‌ర్భంగా వైద్య సిబ్బందితో కలిసి విజ‌య సంకేతాన్ని చూపిస్తూ సంతోషం వ్య‌క్తం చేశారు. వంద శాతం వ్యాక్సినేష‌న్ పూర్తి చేసేందుకు స‌హ‌క‌రించిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు అధికారుల‌కు ప‌ట్ట‌ణ ప్ర‌ముఖుల‌కు ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు .ఈ కార్య‌క్ర‌మంలో ఆర్వోశ్రీధ‌ర్,హెచ్ఈఓవెంక‌ట‌ర‌మ‌ణ‌, వైద్య సిబ్బంది,ఆశా వ‌ర్క‌ర్లు ,అంగ‌న్ వాడీ వ‌ర్క‌ర్లుపాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *