_43 మంది లబ్ధిదారులకు 43 లక్షల రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 43 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజురైన 43 లక్షల రూపాయల విలువైన చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద తల్లిదండ్రులకు ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదన్న సమన్నత లక్ష్యంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తాసిల్దార్ పరమేశం, ఎంపీడీవో బన్సీలాల్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.