Telangana

బీఎస్పీ పార్టీలో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు సింగారం ఓం ప్రకాష్

మనవార్తలు ,అమీన్పూర్:

తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడిగా ముందుండి నడుస్తూ తెలంగాణ సాధనలో బాగస్వాముడైన ఉద్యమకారుడు యువ న్యాయవాది సింగారం ఓం ప్రకాష్ బిఎస్పి పార్టీలో చేరారు.గురువారం అమీన్పూర్ నుండి 300 మందితో  ర్యాలీగా బయలుదేరి బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బిఎస్పీ కండువా కప్పుకున్నారు.  సుల్తాన్పూర్ కు చెందిన టిఆర్ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి చిన్న గల్ల గిరి ఆ పార్టీకి రాజీనామా చేసి బిఎస్పి లో చేరారు

.

ఈ సందర్భంగ సింగారం ఓం ప్రకాష్ మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని మెచ్చి ప్రవీణ్ అడుగు జాడల్లో నడవాలని బీఎస్పీలో చేరుతున్నానని ఆయన అన్నారు. బలహీన వర్గాలు ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత తోనే బహుజన రాజ్యం సాధ్యమని నమ్మి రాజ్యాధికార దిశగా పయనిస్తున్న బీఎస్పీకి తన శక్తి మేరకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. బహుజన రాజ్యాధికారం దిశగా అన్ని వర్గాల ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సతీష్ ,పటాన్చెరు అసెంబ్లీ ఇంచార్జ్ సంజీవ, పటాన్ చెరు అసెంబ్లీ అధ్యక్షుడు వినయ్, సంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ జగదీష్, నాయకులు శ్రీశైలం, సుదర్శన్, రాములు, జనార్ధన్, బేగరి,రమేష్ శీను, రేణుక, నవనీత బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago