Telangana

టెక్నీకల్ వర్కర్లకు మంచి డిమాండ్ ఉంది

– నీడ్స్ రిసోసెర్స్ ఆధ్వర్యంలో వరల్డ్ ప్లంబింగ్ డే సెలబ్రేషన్స్

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :

ప్రపంచ వ్యాప్తంగా టెక్నీకల్ వర్కర్లకు మంచి డిమాండ్ ఉందని మాజీ క్రెడాయి అధ్యక్షులు, ఐ జి బి సి హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ శేఖర్ రెడ్డి అన్నారు. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, టి ఎన్ జి ఓ కాలనిలో ఏర్పాటు చేసిన వరల్డ్ ప్రంబింగ్ డే సెలబ్రేషన్స్ కు ఆయన ముఖ్యాతిగా హాజరై మాట్లాడుతు జర్మనీ లాంటి దేశాల్లో కూడా ప్లంబర్లకు లైసెన్స్ లున్నాయని, లైసెన్స్ లేని ఏ టెక్నీషియన్ ను కూడా ఏ పని చేయనీయరని, ఇంజనీర్ ల కంటే కూడా వీరికే డిమాండ్ ఉందన్నారు. టెక్నీకల్ వర్కర్ల కొరత చాలా ఉందని, టెక్నీకల్ వర్కర్లకు సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ తో పాటు, మరో పదిమంది కి ఉపాధి కల్పించే అవకాశం ఉందన్నారు. ఇంజనీరింగ్ చదివిన వారు కేవలం 15 శాతం మంది మాత్రమే ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నారని, మిగతా వారు వేరే వేరే రంగాల్లో పని చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం కూడా టెక్నీకల్ వర్కర్ల కోసం ప్రత్యేక చొరవ తీసుకొని ట్రేనింగ్ ఇవ్వడానికి ఇతర సంస్థలతో అనుసంధానం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ప్లంబింగ్ వారి అవసరం చాలా ఉందని, హైదరాబాద్ లాంటి నగరంలో గేటెడ్ కమ్యూనిటీ లు పెరిగాయని, వాటిలో వీరి అవసరం ఎంతైనా ఉందన్నారు. వీరి కోసం వేడుక చేసుకోవడం అభినందించదగ్గ విషయమని తెలిపారు.

రాంఖి ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ ఎం. డి. నందకిశోర్ మాట్లాడుతు ప్లంబర్స్ అందరికి శుభాకాంక్షలు తెలిపారు. వీరి పాత్ర అమూల్య మైందని పేర్కొన్నారు. నీడ్స్ రిసో సెర్స్ ఎం. డి పి. ఎస్. రెడ్డి మాట్లాడుతు ప్లంబింగ్ వ్యవస్థ అనేది 5 వేల సంవత్సరాలనుండే ఉందని, అనేకమంది పురావస్తు శాస్త్ర వేత్తలు కనిపెట్టారని, పిరమిడ్ లలో కూడా కాపర్ పైపుల తో చేసిన ప్లంబింగ్ గుర్తులున్నాయని, కాలక్రమేణా అనేక మార్పులు చెందుతు వస్తుందని తెలిపారు. ప్లంబింగ్ వర్క్ వస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఉపాధి పొందవచ్చని తెలిపారు. ఎక్కువ మంది సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ అంటూ అటు వైపు వెళ్తున్నారని, కానీ వీరికున్న డిమాండ్ మరెవరికి లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్లంబింగ్ డే చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, మొత్తం 19 సైట్లలో 150 ప్లంబర్లు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సందర్బంగా పనిలో మంచి ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమం లో ప్లంబింగ్ వర్కర్స్ కో ఆర్డినేటర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago