పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) బాంబే సహకారంతో హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఆసియాలోనే అతి పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్ – టెక్ ఫెస్ట్, ఐఐటీ బాంబే యొక్క ప్రాంతీయ రౌండ్ అయిన టెక్ ఫెస్ట్ హైదరాబాద్ జోనల్స్ 2025ను విజయవంతంగా నిర్వహించింది. గీతంలోని ఈఈసీఈ విభాగంతో పాటు జీ-ఎలక్ట్రా (స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్) నిర్వహించిన ఈ టెక్ ఫెస్ట్ జోనల్స్ పోటీలు విద్యార్థులలో ఆవిష్కరణ, సమస్య పరిష్కారం, సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో వారి నైపుణ్యాలు, సృజనాత్మకతను ప్రదర్శించడానికి జాతీయ వేదికను అందించారు.
హైదరాబాదు ఎడిషన్ లో నాలుగు ప్రధాన పోటీలు జరగ్గా, ఈ ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
కోడ్ కోడ్: ఆన్ లైన్ కోడింగ్ ఛాలెంజ్ (తొమ్మిదో తరగతి నుంచి ఇంజనీరింగ్ చివరి ఏడాది విద్యార్థుల వరకు)
మెష్ మెరైజ్: లైన్ ఫాలోవర్ రోబోటిక్స్ ఛాలెంజ్
కోజ్మో క్లెంచ్: పిక్ అండ్ ప్లేస్ మాన్యువల్ నియంత్రించే కంట్రోల్డ్ బాట్ పోటీ
టీఎఫ్ వో (టెక్ ఫెస్ట్ ఒలింపియాడ్): పాఠశాల విద్యార్థుల కోసం టెక్నికల్ క్విజ్ (8-10 తరగతులు)
గీతంలోని ఆరుగురు అధ్యాపకులు, 40 మంది విద్యార్థి వాలంటీర్లు, ఇద్దరు సాంకేతిక సిబ్బంది సమన్వయంలో దాదాపు 400 మందికి పైగా ఔత్సాహిక విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలు అసాధారణమైన సృజనాత్మకత, బృంద కృషి, ఆవిష్కరణలను ప్రదర్శించి విజయవంతంగా ముగిశాయి. ఇందులో పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు.స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి. మాధవిల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని, అధ్యాపకులు ఎం.నరేష్ కుమార్, బి. బాలాజీ నాయక్ సమన్వయం చేశారు. విద్యార్థి సమన్వయకర్తలు ఎం.గౌరీశంకర్, ఎ.వేణురెడ్డి తదితరులు అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించి, విజయవంతం చేయడానికి కృషి చేశారు.