విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కి పునాది వేసేది ఉపాధ్యాయులే

politics Telangana

– ఫామ్ బీజ్ ప్రైమరి స్కూల్ మూడవ బ్రాంచ్ ప్రారంభo

మన వార్తలు, శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫామ్ బీజ్ ప్రైమరీ స్కూల్ మూడవ బ్రాంచ్ ని పీఏసీ చైర్మన్,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అయన మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది పాఠశాలలు మాత్రమే అని వాళ్ళ బంగారు భవిష్యత్తు నిర్మాణానికి ఉపాధ్యాయులు పాటుపడాలని అన్నారు. భవిష్యత్తులో ఈ స్కూలు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మహిళలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు నిర్మాణంలో ప్రైమరీ స్కూల్ లు ఎంతో దోహదపడతాయని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులు మొదటి గురువు అయితే, విద్యను బోధించేవారు రెండవ గురువని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ అశోక్, వేణు, శ్రీకాంత్ రెడ్డి, కిరణ్, ప్రిన్సిపాల్ షనిలా అడ్రిన్ అకడమిక్ ఇంచార్జి శ్రద్ధ సింగ్, సీనియర్ నాయకులు భాస్కర్ రావు, రోహన్, శైలేందర్ రెడ్డి, కార్యకర్తలు,స్కూలు యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *