నిరుపేదలకు నాణ్యమైన వైద్యం గూడెం మహిపాల్ రెడ్డి

17 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ   పటాన్చెరు ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 17 లక్షల యాభై నాలుగు వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన […]

Continue Reading

టిఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగాల నూతన కార్యవర్గ ప్రకటన

పార్టీ పటిష్టతకు సైనికుల వలే కృషి చేయాలి ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు టిఆర్ఎస్ పార్టీ పటిష్టతకు విద్యార్థి, యువజన విభాగాల నాయకులు సైనికుల వలె కృషిచేయాలని, కష్టపడే ప్రతి కార్యకర్త ను పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి విద్యార్థి, యువజన విభాగాల నూతన కార్యవర్గాలను ప్రకటించారు. ఈ సందర్భంగా […]

Continue Reading

పెదకంజర్ల గ్రామం లో 50 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

శరవేగంగా గ్రామాల అభివృద్ధి ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పటాన్చెరు మండల పరిధిలోని పెదకంజర్ల గ్రామం లో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన […]

Continue Reading

వైకుంఠధామం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరం బండ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న ట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం రామేశ్వరంబండలో వైకుంఠధామం నిర్మాణ పనులకు స్థానిక సర్పంచ్ ధరణి అంతి రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో వైకుంఠ దామాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు . నియోజవర్గంలో ఇప్పటికే దాదాపు అన్ని గ్రామాల్లో వైకుంఠ దామాలు పూర్తయినట్లు […]

Continue Reading

వచ్చే ఆరు నెలల్లో ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో సీసీ కెమెరాలు

వడక్ పల్లి లో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ అమీన్పూర్ వచ్చే ఆరు నెలల్లో నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం అమిన్ పూర్ మండల పరిధిలోని వడక్ పల్లి గ్రామంలో లక్షన్నర రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన పది సీసీ కెమెరాలను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ […]

Continue Reading

రుద్రారం సిద్ది గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు వినాయక చవితినీ పురస్కరించుకొని ప్రసిద్ధ రుద్రారం సిద్ధి గణపతి వినాయకుడిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ […]

Continue Reading

విద్యార్థి, యువత విభాగాలే.. పార్టీకి వెన్నెముక భవిష్యత్తు మీదే..

గ్రామ స్థాయి నుండి విద్యార్థి, యువత విభాగాలను పటిష్టం చేయండి పటాన్చెరు ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీకి విద్యార్థి, యువత విభాగాలే వెన్నెముక అని, సంస్థాగతంగా రెండు విభాగాలను పటిష్టం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి టిఆర్ఎస్ పార్టీ అనుబంధ విద్యార్థి, యువత విభాగాల ముఖ్య నాయకులు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన […]

Continue Reading

కోటి రూపాయలతో అమీన్పూర్ లో వైకుంఠధామం

అమీన్పూర్ అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో ప్రజల సౌకర్యార్థం కోటి రూపాయలతో వైకుంఠధామం నిర్మించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని టైలర్స్ కాలనీలో గల ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో కోటి రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయబోతున్న వైకుంఠధామం నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి సారిగా ప్రతి గ్రామంలో […]

Continue Reading

దేవాలయ అభివృద్ధికి పది లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే

భగులాముఖి శక్తి పీఠం శిలన్యాసం లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు మండల కేంద్రమైన శివ్వంపేట లో నిర్మిస్తున్న భగులాముఖి శక్తి పీఠం శిలన్యాసం కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయం అభివృద్ధి కి 10 లక్షల రూపాయల విరాళం అందించనున్నట్లు తెలిపారు. మానవ సేవయే మాధవ సేవ యని, దేవాలయాల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ భగవన్నామస్మరణ […]

Continue Reading

విద్యార్థులారా ధైర్యంగా పాఠశాలలకు వెళ్ళండి _ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు: ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ప్రతి విద్యార్థి తమ తమ పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లాలని, ప్రభుత్వం తరఫున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులు వీడియో సందేశం అందించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి పాఠశాల, కళాశాలను శానిటేషన్ చేయడంతో పాటు తరగతి […]

Continue Reading