Telangana

స్వచ్ఛ సర్వేక్షన్-2023 సైకిల్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ ను నియంత్రించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఎంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షన్ 2023 కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి మైత్రి మైదానం వరకు ఏర్పాటుచేసిన సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ప్రతి ఒక్కరికి స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ ద్వారా వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. ప్రధానంగా చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పారవేయకుండా స్వచ్ఛ ఆటోలకు అందించడంతోపాటు 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లను వినియోగించకూడదని కోరారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల ఆవరణలో మొక్కల పెంపకానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, జిహెచ్ఎంసి అధికారులు, సైక్లింగ్ బృంద సభ్యులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

6 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

8 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago