మనవార్తలు ,శేరిలింగంపల్లి :
మియపూర్ ఆర్టిసి డిపోలో ఔట్ సోర్సింగ్ విభాగంలో హౌస్ కీపింగ్ గా పని చేస్తున్న మెదక్ జిల్లా, పాపన్నపేట్ గ్రాస్మానికి చెందిన కాశ సామయ్యా మంగళవారం రోజు గుండెపోటుతో మృతి చెందాడు..తోటి కార్మికులలు మియాపూర్. డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు, ఇలియజ్ షరీఫ్ దృష్టికి తీసుకురావడం తో స్పందించిన ఆయన వెంటనే ఆర్టీసీ కార్మిక విభాగం అధ్యక్షుడు, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షుడు నడిమింటి కృష్ణ ను ఘటనా స్థలానికి పంపించారు. దీంతో తోటి కార్మికుల తో కల్సి ఆర్టీసీ డిపో మేంనేజర్ తో చర్చలు జరపగా అర్వత కలిగిన మృతుడి కుటుంబ సభ్యులకి తమ డిపోలోనే ఉద్యోగoకల్పిస్తామని డిపో మేనేజర్ హామీ ఇచ్చారని యూనియన్ నాయకులు తెలిపారు. తోటి కార్మికులతో పాటు మేనేజర్ కూడా ఆర్హిక సహకారం అందివ్వడానికి ముందుకు వచ్చారు.ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షుడు నల్లగండ్ల రమేష్ కుమార్, డి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.