Telangana

గీతం లో విజయవంతంగా ముగిసిన కార్యశాల…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఆర్ ప్రోగామింగ్ను ఉపయోగించి డాష్బోర్డ్ భావన రుజువు చేసే విద్యార్థుల ప్రాజెక్టును శుక్రవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లో శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. గీతం కెరీర్ గెడైన్స్ కేంద్రంలోని యోగ్యతాభివృద్ధి విభాగం ‘ఆర్ ప్రోగ్రామింగ్ అండ్ పెథాన్’పై ఏర్పాటు చేసిన ఈ కార్యశాలలో, హైదరాబాద్ లోని షిషన్ ల్యాబ్స్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పి. అంజనా నారాయణ ముఖ్య శిక్షకురాలిగా పాల్గొన్నారు.కంప్యూటర్ సెన్స్డ్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) విభాగం సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యశాలలో విద్యార్థులు తమ అకడమిక్ ప్రాజెక్టుల కోసం వెబ్ అప్లికేషన్ డ్యాష్ బోర్డులు, ఆర్, పెనీ, బీఎస్ 4 డ్యాష్, ప్యాకేజీలను ఉపయోగించి సోషల్ మీడియా పేజీని అభివృద్ధి చేశారు. ఆ పోస్టు కింద వ్యాఖ్యలను కూడా చేసే వీలు కల్పించారు. అంజనా మార్గదర్శనంలో విద్యార్థులంతా వెబ్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి, వెబ్సైట్ నిర్వహణకు, ప్రాజెక్టు వర్కులు చేయడంపై అవగాహన ఏర్పరచుకున్నారు.

ఉద్యోగ ఇంటర్వ్యూల సమయంలో ఈ అనుభవం విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తుందని ఆమె తెలిపారు. వాస్తన (రియల్ చెమ్) ప్రాజెక్టులను ఎలా తనిఖీ చేయాలి. వాటిని ఎలా నిర్వహించాలి, ఎలా అమలు చేయాలి అనే వాటిపై కూడా అంజన మార్గదర్శనం చేశారు.గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, కెరీర్ గెడైన్స్ కేంద్రం. సంచాలకుడు డాక్టర్ వేణుకుమార్ నాతి, యోగ్యతాభివృద్ధి సంచాలకురాలు డాక్టర్ రోజీనా మాథ్యూ, సీఎస్ఈ శ్రీ విభాగాధిపతి డాక్టర్ ఎస్.ఫణికుమార్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యశాలను అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ బి. రవితేజ, డి.శ్రీనివాసరావులు సమన్వయం చేశారు.ఉర్రూతలూగించిన జానపద సంగీతంబందు ఖాన్, ఆయన సహచర బృందం గీతన్లోని శివాజీ ఆడిటోరియంలో శుక్రవారం చేసిన రాజస్థానీ జానపద సంగీతం ఆహూతులందరినీ ఉర్రూతలూగించింది.

 

 

మానవాళికి దేవుడిచ్చిన నరం సంగీతం అనేది ఆ బృ ందం నిరూపించింది. ఒక్కో ప్రదర్శన పూర్తవుతూనే ఆడిటోరియం చప్పట్లతో మార్మోగిపోయింది. పలువురు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని, రాజస్థాన్ జానపద కళాకారులను ప్రశంసలతో ముంచెత్తారు. గీతం-స్పిక్ మాకే హెరిటేజ్ క్లబ్, స్టూడెంట్ లెఫ్ట్ డెరైక్టరేట్, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెస్ (జీఎస్ హెచ్ఎస్ లు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago