పటాన్‌చెరు,,మనవార్తలు ప్రతినిధి :
స్టార్టప్లు, వర్ధమాన పారిశ్రామికవేత్తలను సన్నద్ధం చేసే లక్ష్యంతో గీతం హెదరాబాద్లోని వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడీసీ) నిర్వహిస్తున్న ఆరు రోజుల ‘సమ్మర్ స్టార్టప్ స్కూల్’లో భాగంగా ‘డిజెన్ థింకింగ్ వర్క్షాప్’తో పాటు ‘వెంచర్ ఫారెస్ట్ ట్రయల్స్’ పేరిట క్షేత్ర స్థాయి పర్యటన ఆదివారం విజయవంతంగా ముగిశాయి. సమస్య-పరిష్కార నెపుణ్యాలు, ఆవిష్కరణ వ్యూహాలతో కూడిన ఈ వర్క్షాప్ను వీడీసీ సీనియర్ వెంచర్ కోచ్ లు వాసుదేవ్ వంగర, యామిని రాపేటి నిర్వహించారు. క్షేత్ర పర్యటనను కూడా వారు పర్యవేక్షించారు. వ్యాపారం విజయవంతం కావాలంటే, వినియోగదారుల అవసరాలపై లోతైన అవగాహనను ఏర్పరచుకోవడం, సృజనాత్మకంగా యోచించడం వంటి మెళకువలను వారు వివరించారు.ఈ ప్రపంచ సంక్షోభానికి వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి ‘జీవవైవిధ్య నష్టం’ అనే ఇతివృత్తంతో సమస్య-పరిష్కారానికి మానవ-కేంద్రీకృత విధానంపై ఈ కార్యశాల దృష్టి సారించడంతో పాటు స్టార్టప్ల విజయంలో దాని పాత్రను వివరించారు.సవాళ్లను సరికొత్త దృక్పథంతో ఎదుర్కోవడానికి, ఆవిష్కరణలు చేయడానికి, వినియోగదారులకు అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులు, సేవలు అందించడానికి ఈ కార్యశాలలో చేసిన మార్గదర్శనం తమకు ఎంతో తోడ్పడుతుందని ఇందులో పాల్గొన్న విద్యార్థులు అభిప్రాయపడ్డారు. అలాగే క్షేత్ర పర్యటన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందన్నారు.