Telangana

ఇష్టంతో చదవండి..లక్ష్యాన్ని సాధించండి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఇష్టపడి చదివి క్రమశిక్షణతో ముందుకు సాగితే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల మరియు బాలుర ఉన్నత పాఠశాలలో ఎంకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి ప్రతిభావంతులకు నగదు పురస్కారల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచే సిన ఎంకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 30 మంది విద్యార్థులకు 5000 రూపాయల చొప్పున నగదు పురస్కారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో పదవ తరగతి అత్యంత కీలకమని అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ భవిష్యత్తుకు బంగారు బాటను వేస్తున్నామని తెలిపారు.

పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో అత్యాధునిక సౌకర్యాలతో పాటు ఆధునిక వసతులతో కూడిన భవనాలు నిర్మించి అందుబాటులోకి తేవడం జరిగిందని తెలిపారు.పటాన్‌చెరు కేంద్రంలో కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడం మూలంగా అడ్మిషన్లు సైతం దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రతి సంవత్సరం నియోజకవర్గం వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులకు మానసిక వికాస శిక్షణ తరగతులతో పాటు విద్యార్థులను ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపట్టడం పట్ల మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మండల విద్యా శాఖ అధికారి నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు అశోక్, ప్రభాకర్, వెంకటేష్, రాజు, ఇమ్రాన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago