మనవార్తలు ,పటాన్ చెరు:
విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్‌చెరు పట్టణంలోని చైతన్య స్కూల్ సీబీఎస్ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై, మాట్లాడుతూ చైతన్య స్కూల్ క్రమశిక్షణకు మారుపేరని కొనియాడారు. చైతన్య స్కూల్లో చదివిన విద్యార్థులు ఉన్నతమైన స్ధానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ చదువుకోవాలని, దానితో విద్యనభ్యసించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పాటునందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పి.పి రాథోడ్, చైతన్య స్కూల్ కరస్పాండెంట్ నర్సింహ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

