Telangana

పది ఫలితాల్లో సత్తా చాటిన శిశు విహార హై స్కూల్ విద్యార్థులు…

– బాలికలదే పై చేయి

– విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్ చెరు పట్టణంలోని శిశు విహార్ హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాలలో తమ సత్తా చాటారు,78 విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 74 మంది విద్యార్థులు 9.6 నుండి 9.6 వరకు పాయింట్స్ సాధించారు, నలుగురు విద్యార్థులు 10/10 పాయింట్స్ సాధించి పాఠశాల పేరును జయ కేతనాన్ని ఎగురవేశారు. సాయి ధనుష శ్రీ, చందన, స్పందన, వర్షిని, బాలికలు 10/10 పాయింట్స్ సాధించి తమ ప్రతిభను ప్రఖ్యాతి గాడించారు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు, ప్రిన్సిపల్ బీనా, అనిల్, ఉపాధ్యాయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు, పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, మండల విద్యాధికారి పీపీ రాథోడ్, పటాన్ చెరు మైనారిటీ నాయకుడు మహమ్మద్ షకీల్ లడ్డు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు, భవిష్యత్తులో బ్రహ్మాండమైన విజయాలు సాధించాలని  కోరారు .

ఈ సందర్భంగా శిశు విహార హై స్కూల్ ప్రిన్సిపల్ బీనా అనిల్ మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 12 సంవత్సరల నుండి పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు, 13 మంది విద్యార్థులతో మొదలైన పాఠశాల ప్రస్తుతం పదవ తరగతిలో 78 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించి వారి ప్రతిభను మేము చెబుతున్న బోధనలను అందరికీ తెలిసేలా పేరు ప్రఖ్యాతలను పెంచినందుకు విద్యార్థులకు వారికి సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు గా ఎదగాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు .

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

13 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

14 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago