Telangana

ప్రతిచోటా గణాంకాలు: ప్రొఫెసర్ జేఎస్ రావు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ప్రస్తుత ప్రపంచంలో గణాంకాల ప్రాధాన్యం బాగా పెరిగిపోయిందని, ఏ రంగంలో చూసిన గణాంకాల ఆవశ్యకత తప్పనిసరిగా మారిందని అమెరికాలోని శాంటా బార్బరాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం స్టాటిస్టిక్స్, ఆఫ్లెడ్జ్ ప్రాబబిలిటీ విభాగ విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ జే.ఎస్.రావు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘గణాంకాలు కొన్ని విహారాలు’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.నేటి సమాజంలో అనువర్తిత గణాంకాలు విస్తృతంగా ఉన్నాయని గణాంక రంగంలో నిపుణుడెన ప్రొఫెసర్ రావు చెప్పారు. ప్రపంచాన్ని మార్చే పరిణామాలను కనుగొని అమలు చేయడానికి గణాంక నిపుణులు తెర వెనుక నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. డేటా మెనింగ్, బిజినెస్ అనలిటిక్స్, యాక్చురియల్, ఫైన్టాన్షియల్ మోడల్స్, వచన-దృశ్య విశ్లేషణ (టెక్స్ట్-ఇమేజ్ అనాలిసిస్) వంటి వివిధ రంగాలకు గణాంకాల వినియోగం విస్తరించినట్టు. ఆయన తెలిపారు.

వాస్తవ ప్రపంచంలో గణాంకాల పాత్ర ఈ నిర్దిష్ట రంగాలకు మించినదని, ఇది విశ్వవ్యాప్తంగా ప్రభుత్వ కార్యకూపాలలో కీలక భూమిక పోషిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రజా భద్రత, ఆరోగ్య సంరక్షణ మెరుగుదల, వివిధ విభాగాలలో జ్ఞాన పురోగతికి దోహదం చేస్తుందని చెప్పారు. ఏదైనా ముఖ్యమైన రంగంలో పరిశోధకులకు గణాంక మద్దతు ప్రాముఖ్యతను ప్రొఫెసర్ జేఎస్ రావు నొక్కిచెప్పారు.నేటి డేటా ఆధారిత ప్రపంచంలో, గణాంకాలను అన్వయించడమనేది సమాజంలోని ప్రతి అంశాన్ని స్పృ శించే నిత్య వాస్తవికతగా పేర్కొన్నారు. గణాంకాల రంగం శతాబ్దాలుగా ఉన్నప్పటికీ, ఆధునిక గణాంకవేత్తల వినూత్న పరిష్కార విధానాల కారణంగా ఇటీవలి సంవత్సరాలలో దాని ప్రభావం గణనీయంగా విస్తరించినట్టు డాక్టర్ రావు, చెప్పారు.కాగా, అతిథిని గణిత శాస్త్ర విభాగం ప్రొఫెసర్ బీ.ఎం. నాయుడు స్వాగతించి, ఆయన నైపుణ్యాలను ‘పంచుకునేందుకు గీతం విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago