– ఔషధ మలినాల పై పరిశోధనకు డాక్టరేట్ అర్హత
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
హైదరాబాద్‌లోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి శ్రీనివాస్ నక్కా పీహెచ్‌డీ పట్టాకు అర్హత సాధించారు. ‘విశ్లేషణాత్మక నాణ్యత (ఏక్యూబీడీ), హరిత రసాయన శాస్త్ర సూత్రాల ఆధారంగా ఔషధాల్లో నైట్రోసమైన్ ఔషధ పదార్థ సంబంధిత మలినాల (ఎన్‌డీఎస్‌ఆర్‌ఐలు) గుర్తింపునకు ఎల్‌సీ–ఎంఎస్ పద్ధతి అభివృద్ధి’ అంశంపై ఆయన పరిశోధన చేశారు. ఈ మేరకు సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించినట్లు పరిశోధనకు మార్గదర్శకత్వం వహించిన ప్రొఫెసర్ ఎం.ఎస్. సురేంద్రబాబు తెలిపారు.ఔషధాల తయారీ, సంశ్లేషణ, సూత్రీకరణ, నిల్వ ప్రక్రియల్లో ఏర్పడే ఎన్‌డీఎస్‌ఆర్‌ఐల వల్ల కలిగే ఔషధ నాణ్యత, రోగుల భద్రతకు సంబంధించిన సమస్యలపై పరిశోధన సాగించారు. సిప్రోఫ్లోక్సాసిన్, మోక్సిఫ్లోక్సాసిన్, ఏక్లోఫెనాక్, మెఫెనామిక్ యాసిడ్, టామ్సులోసిన్ తదితర ఔషధాల్లోని మలినాల సంశ్లేషణ, విషపూరితత అంచనా, పరిమాణ నిర్ధారణపై అధ్యయనం చేశారు. వీటిని కచ్చితంగా గుర్తించేందుకు అత్యంత సున్నితమైన యూపీఎల్‌సీ–ఎంఎస్/ఎంఎస్ విశ్లేషణా పద్ధతిని అభివృద్ధి చేశారు.శ్రీనివాస్ నక్కా పీహెచ్‌డీకి అర్హత సాధించడంపై గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా, విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. పరిశోధనకు మార్గదర్శకత్వం వహించిన ప్రొఫెసర్ ఎం.ఎస్. సురేంద్రబాబును కూడా అభినందించారు.
రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…
ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…
శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…