Telangana

శ్రీకాంత్ గౌడ్ కుటుంబానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే జిఎంఆర్ పరామర్శ

కుమార్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడిల శ్రీకాంత్ గౌడ్ కుటుంబాన్ని రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లు పరామర్శించారు.శ్రీకాంత్ గౌడ్ తండ్రి గడిల కుమార్ గౌడ్ రెండు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇస్నాపూర్‌లోని శ్రీకాంత్ గౌడ్ నివాసానికి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వెళ్లారు. ముందుగా కుమార్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం శ్రీకాంత్ గౌడ్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, కుమార్ గౌడ్ మృతికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి ఈ క్లిష్ట సమయంలో అండగా ఉంటామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అనంతరం ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గడీల కుమార్ గౌడ్ ను పరామర్శించారు. ఇటీవల కుమార్ గౌడ్ తండ్రి గడిల ఈశ్వరయ్య గౌడ్ గారు అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

16 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

19 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

21 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

21 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

21 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago