రసాయన శాస్త్రంలో శ్రీనివాస్ పీహెచ్‌డీ.

Telangana

– ఔషధ మలినాల పై పరిశోధనకు డాక్టరేట్‌ అర్హత

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

హైదరాబాద్‌లోని గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి శ్రీనివాస్‌ నక్కా పీహెచ్‌డీ పట్టాకు అర్హత సాధించారు. ‘విశ్లేషణాత్మక నాణ్యత (ఏక్యూబీడీ), హరిత రసాయన శాస్త్ర సూత్రాల ఆధారంగా ఔషధాల్లో నైట్రోసమైన్‌ ఔషధ పదార్థ సంబంధిత మలినాల (ఎన్‌డీఎస్‌ఆర్‌ఐలు) గుర్తింపునకు ఎల్‌సీ–ఎంఎస్‌ పద్ధతి అభివృద్ధి’ అంశంపై ఆయన పరిశోధన చేశారు. ఈ మేరకు సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించినట్లు పరిశోధనకు మార్గదర్శకత్వం వహించిన ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌. సురేంద్రబాబు తెలిపారు.ఔషధాల తయారీ, సంశ్లేషణ, సూత్రీకరణ, నిల్వ ప్రక్రియల్లో ఏర్పడే ఎన్‌డీఎస్‌ఆర్‌ఐల వల్ల కలిగే ఔషధ నాణ్యత, రోగుల భద్రతకు సంబంధించిన సమస్యలపై పరిశోధన సాగించారు. సిప్రోఫ్లోక్సాసిన్‌, మోక్సిఫ్లోక్సాసిన్‌, ఏక్లోఫెనాక్‌, మెఫెనామిక్‌ యాసిడ్‌, టామ్సులోసిన్‌ తదితర ఔషధాల్లోని మలినాల సంశ్లేషణ, విషపూరితత అంచనా, పరిమాణ నిర్ధారణపై అధ్యయనం చేశారు. వీటిని కచ్చితంగా గుర్తించేందుకు అత్యంత సున్నితమైన యూపీఎల్‌సీ–ఎంఎస్‌/ఎంఎస్‌ విశ్లేషణా పద్ధతిని అభివృద్ధి చేశారు.శ్రీనివాస్‌ నక్కా పీహెచ్‌డీకి అర్హత సాధించడంపై గీతం హైదరాబాద్‌ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్‌ డి.ఎస్‌.రావు, రెసిడెంట్‌ డైరెక్టర్‌ డీవీవీఎస్‌ఆర్‌ వర్మ, స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.రెజా, విభాగాధిపతి డాక్టర్‌ గౌసియా బేగం, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. పరిశోధనకు మార్గదర్శకత్వం వహించిన ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌. సురేంద్రబాబును కూడా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *