మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
శ్రీ చైతన్య నల్లగండ్ల విద్యార్థులు మరోసారి తమ సత్తాను నిరూపించారు. చదువులోనే కాదు అన్ని రంగాల్లోనూ ముందుంటామని మరోసారి చాటి చెప్పారనీ స్కూల్ ప్రిన్సిపాల్ యూ. వాణి తెలిపారు. శ్రీ చైతన్య పాఠశాలల యాజమాన్యం స్వర్గీయ బి. యస్. రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ నిర్వహించింది. ఈ కాంపిటీషన్ లో నల్లగండ్ల విద్యార్థులు బ్యాట్మెంటన్ లో ప్రథమ స్థానాన్ని షార్ట్ పుట్ లో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుని ఘన విజయం సాధించారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రికెట్ స్పోర్ట్స్ పర్సన్ గొంగడి త్రిష, శ్రీ చైతన్య పాఠశాలల డైరెక్టర్ సీమ, ఏజీఎం. శివరామకృష్ణ, ఆర్ ఐ. అనిత, జోనల్ స్పోర్ట్స్ రిసోర్స్ పర్సన్ రాజశేఖర్, జోనల్ స్పోర్ట్స్ ఇంచార్జ్ మధు, స్పోర్ట్స్ టీచర్స్ సుబుద్ధి, సంతోష్ లు పాల్గొన్నారు. మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన విద్యార్థులు పలువురి చూపరుల ప్రశంసలు అందుకున్నారు. విజేతలను ఏజీఎం శివరామకృష్ణ, ఆర్. ఐ. అనిత చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్స్, ఛాంపియన్ ట్రోఫీని అందుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ యు వాణి తమ విద్యార్థులు ఇంతటి ఘనవిజయం సాధించినందుకు గర్వంగా ఉందని ఈ విజయానికి కారణమైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలని ఆకాంక్షించారు. శ్రీ చైతన్య యాజమాన్యం విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.