సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ డే వేడుకలు
ఆలరించిన విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం చేకూరుతుందని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పేర్కొన్నారు.పటాన్ చెరు డివిజన్ పరిధిలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో గురువారం స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథితులు గా పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ పృథ్వీరాజ్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన గావించి స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ క్రీడలు మన జీవితంలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక బలాన్ని కూడా పెంపొందిస్తాయన్నారు. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే మాటను నిజం చేసేది క్రీడలేనని,క్రీడల ద్వారా మనం క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు మరియు క్రీడాస్ఫూర్తిని నేర్చుకుంటాము. గెలుపు ఓటములు కేవలం ఫలితాలు మాత్రమేనని కానీ క్రీడా స్ఫూర్తితో పాల్గొనడమే అసలైన విజయమన్నారు.
ఓటమి మనకు అనుభవాన్ని నేర్పితే, విజయం మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందన్నారు. క్రీడా పోటీలలో పాల్గొనే ప్రతి విద్యార్థి, విద్యార్ధినులందరు నిజమైన విజేతలే అన్నారు. విద్యతో పాటుగా క్రీడలలో ఉపాధ్యాయుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం వల్లే విద్యార్థులు గొప్ప ప్రపంచ స్థాయి క్రీడాకారులు అవుతారని చెప్పారు. ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మాట్లాడుతూ విద్యార్థులకు సంస్కారం అనేది ఇంటి నుంచే ప్రారంభమావ్వాలని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద దృష్టి పెట్టి సంస్కారం నేర్పడంతో పాటు వాళ్ళ పిల్లల పైన రోజు కొంత శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆలరించాయాయి.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగేశ్వర రావు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కరస్పెండెంట్ జోసెఫ్ బాబు,సెల్వన్ ఫాదర్, ఇష్టా విద్యాసంస్థల పటేల్ గూడ బ్రాంచ్ ప్రిన్సిపల్ రజిత, బీరంగూడ బ్రాంచ్ ప్రిన్సిపల్ తులసి, ఆల్విన్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ,మిల్క్ రాజు, సన్నీ యాదవ్, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
దేశ నలుమూలల నుంచి తరలి వచ్చిన ప్రసిద్ధ ప్రొఫెసర్లు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్…
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : కుషల్స్ ఆభరణాలు సంప్రదాయం, ఆధునిక డిజైన్‌ను అందంగా సమతుల్యం చేస్తాయి అని నటి…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎస్.డి.భవానీ…
సమ్మక్క సారలమ్మ కృపతో ప్రజలందరూ చల్లగా ఉండాలి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్: సమ్మక్క…
పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మూడు కోట్ల 30 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు 30…