శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ డే వేడుకలు

Hyderabad Telangana

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :

రిపబ్లిక్ డే సందర్భంగా స్థానిక నల్లగండ్ల శ్రీ చైతన్య పాఠశాల (సి. బి.యస్.ఇ) లో స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాదాపూర్ డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీస్ శిల్పవల్లి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. విశేష అతిథులుగా రీజనల్ ఇన్చార్ట్ అనిత, ప్రిన్సిపల్ వాణి, జోనల్ కోఆర్డినేటర్ అన్నపూర్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ క్రీడలను వీక్షించారు. ఈ సందర్భంగా శిల్పవల్లి మాట్లాడుతూ శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడలలో నైపుణ్యం సాధించే దిశగా కృషి చేస్తుందని కొనియాడారు. మహిళల, విద్యార్థుల సేఫ్టీ గురించిన సేఫ్టీ క్లబ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.

తదుపరి కార్యక్రమంలో విశేష అతిథిగా పాల్గొన్న రీజనల్ ఇన్చార్జ్ అనిత మాట్లాడుతూ విద్యార్థులు ఆట స్థలమందు సాయంత్రం సమయంలో ఆటలు ఆడాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ వాణి మాట్లాడుతూ విద్యార్థులను బహుముఖ ప్రజ్ఞావంతులుగా చేయడమే శ్రీ చైతన్య విద్యాసంస్థల లక్ష్యమని అన్నారు. వివిధ క్రీడలలో విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారం వల్ల మాత్రమే ఈ కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటలతో పాట, డంబుల్ డ్రిల్, వేన్స్ డ్రిల్, పిరమిడ్స్, దాండియా, శంభోశివశంభో, హోలాహోబ్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డీన్ కోటేశ్వరరావు, ప్రయమరీ ఇంచార్జ్ అమల, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *