పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గీతం స్మార్ట్ ఐడియా థాన్ తుది పోటీలను హెదరాబాద్ ప్రాంగణంలో ఈనెల 24-25 తేదీలలో నిర్వహించనున్నారు. స్టార్టప్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ (సీఈఎం), బోస్టన్లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎడ్యుకేషన్ (ఎన్ఎయూసీఈఈ)ల సహకారంతో ఈ పోటీలను ఏర్పాటు చేస్తున్నట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.సామాజిక ఆవిష్కరణల ద్వారా స్థిరమైన, స్థితిస్థాపకంగా ఉండే సమూహాలను నిర్మించడంలో సహాయపడే స్టార్టప్లలో పనిచేయడానికి విద్యార్థులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మనదేశంలో యూజీ, పీజీ అభ్యసిస్తున్న విద్యార్థులు తమ వ్యవస్థాపక నెపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇదో వేదికగా అభివర్ణించారు. ఆహారం – ఆరోగ్యం, స్టెమ్ కోసం బొమ్మలు, స్థిరమైన ఫ్యాషన్, తక్కువ వ్యయంతో ఆవిష్కరణ అనే నాలుగు ఇతివృ త్తాలుగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.
దేశవ్యాప్తంగా వెయ్యికి పెగా ప్రతిపాదనలు రాగా, రెండు విడతల వడపోత తరువాత 32 జట్లు సెమీ-ఫెనల్ లోకి ప్రవేశించాయని, వీటితో పాటు తుది పోటీలను కూడా ఈ రెండు రోజుల్లో (24-25 తేదీలలో) పూర్తిచేస్తామని తెలిపారు. ఇందులో పాల్గొనే వారికి పరిశ్రమ నిపుణులు, వ్యవస్థాపకులు, విశిష్ట అతిథులతో ముఖాముఖిని ఏర్పాటు చేస్తామన్నారు.చివరిగా, విజేతగా నిలిచిన జట్టుకు రెండు లక్షల రూపాయల నగదు పురస్కారంతో పాటు బోస్టస్లో రెండు వారాల శిక్షణకు పంపుతామని, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు లక్ష రూపాయల బహుమతితో పాటు బోస్టస్లో శిక్షణకు పాక్షిక సాయం అందిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.ఇవేకాక మరో మూడు బహుమతులను ఈ పోటీలలో పాల్గొనేవారు గెలుచుకోవచ్చని, సమాజంపై ప్రభావం చూపే ఉత్తమ ఆలోచనకు రూ.50 వేల నగదు పురస్కారంతో పాటు ఒక సభ్యునికి బోస్టన్ శిక్షణకు అయ్యే ఖర్చును భరిస్తామని తెలిపారు. ఉత్తమ మహిళా వ్యవస్థాపక ఆలోచనకు రూ.50 వేల బహుమతితో పాటు ఒక సభ్యురాలికి బోస్టన్ శిక్షణ అందిస్తామన్నారు. లెబెన్ జాన్సన్ పీపుల్స్ ఛాయిస్ అవార్డు (తుది పోటీల సమయంలో ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఎంపిక) గ్రహీతకు రూ.50 వేల నగదు పురస్కారాన్ని అందజేస్తామని తెలియజేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…