పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకొని పఠాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని ఇస్నాపూర్ గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు విచ్చేసి సీతారాముల వారిని దర్శించుకుని తీర్థప్రసాదలను అందుకున్నారు. అనంతరం మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి.మాట్లాడుతూ సీతారాముడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ,గత ఆరు సంవత్సరాల నుండి సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని , బిఎస్ కే యువసేన సభ్యుల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహింమని. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామని కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి తెలిపారు . అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి, ఎంపీటీసీ అంజిరెడ్డి, వార్డు సభ్యులు గోవర్ధన్ రెడ్డి, బిఎస్ కే యువసేన సభ్యులు శామిల్,హర్ష,మనోజ్, ప్రవీణ్, ప్రశాంత్, సంతు, శివ, సాయి, సుధాకర్,గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.