మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజా చైతన్య గ్రామీణ సాంకేతికత అభివృద్ధి మండలి(capart) పథకం ద్వారా పట్టాలు పొందిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని వందమంది బాధితులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ డివిజన్ ఇంచార్జ్ రాధాకృష్ణ పంతులు ఆధ్వర్యంలో బాధితులు తహసీల్దార్ హరిబాబుని కలిసి వినత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1990 సంవత్సరంలో అప్పటి సర్పంచ్ భాస్కరరావు కాపార్ట్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 100 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేసిందని తెలిపారు. అయితే అప్పట్లో కొంతమంది నిర్మించుకొని పన్నులు చెల్లిస్తున్నారని, మరి కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇల్లు నిర్మించుకోలేకపోయామని వాపోయారు. ప్రస్తుతం అందులో ఇల్లు నిర్మించుకునేలా రెవెన్యూ అధికారులు ఎన్వోసీ జారీచేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆ స్థలాల్లో ఇల్లు నిర్మించుకునేలా చూసి ఆదుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సత్తెయ్య, చాంద్ పాషా, లింగయ్య, అనసూజ, లక్ష్మమ్మ, లక్ష్మి, శ్యామల, సులోచన, రాజమణి, నాగేశ్వరరావు, ఎండీ ఖాజా తదితరులు పాల్గొన్నారు.
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…
మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: మియాపూర్ మక్త మహబూబ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రజయ్ షెల్టర్స్, ఎస్‌ఆర్ ఎస్టేట్స్, నైలా గేటెడ్ కమ్యూనిటీ,…