Telangana

మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ – మిసెస్ కాన్ఫిడెంట్’ టైటిల్‌ విజేతగా సిప్రా మల్లిక్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : 

హైదరాబాద్‌కు చెందిన సిప్రా మల్లిక్, ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2026 సీజన్-4 నేషనల్ ఫైనల్స్ లో ప్రతిష్ఠాత్మకమైన ‘మిసెస్ కాన్ఫిడెంట్’ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. గ్లామర్ గుర్‌గావ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో దేశం నలుమూలల నుంచి ప్రతిభావంతులైన వివాహిత మహిళలు పాలుపంచుకున్నారు.ఈ పోటీల్లో సిప్రా మల్లిక్ తన ఆత్మవిశ్వాసం, హుందాతనం, స్పష్టమైన భావవ్యక్తీకరణ, వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ నైపుణ్యం, మేధస్సు, మాట్లాడే తీరు వంటి విభిన్న అంశాలపై న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకొని ‘మిసెస్ కాన్ఫిడెంట్’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.ఈ సందర్భంగా బేగంపేటలోని కంట్రీక్లబ్ లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ లో సిప్రా మల్లిక్ మాట్లాడుతూ, “‘మిసెస్ కాన్ఫిడెంట్’ టైటిల్‌ను గెలుచుకోవడం నాకు వ్యక్తిగత విజయమే కాదు.. ప్రతి మహిళ తన సౌకర్యవంతమైన పరిధిని దాటి, తనలోని అసలైన సామర్థ్యాన్ని గుర్తించి ముందుకు సాగాలని ఈ విజయం చెబుతోందన్నారు. నిజమైన ఆత్మవిశ్వాసం మన వ్యక్తిత్వాన్ని మనం స్వీకరించడంలోనే ఉంటుంది. నా ప్రయాణం మరెందరో వివాహిత మహిళలకు తమ కలలను సాకారం చేసుకునేందుకు, తమ వ్యక్తిత్వాన్ని తిరిగి గుర్తించేందుకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. మహిళా సాధికారత, మానసిక ఆరోగ్యం అంశాలపై సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని ఆమె ఈ సందర్భఁగా సంకల్పించారు.తనకు సహకరించిన గ్లామర్ గురుగ్రామ్ బృందానికి, మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ నిర్వాహకులకు, గ్లామర్ గురుగ్రామ్ డైరెక్టర్ బర్ఖాకు సిప్రా కృతజ్ఞతలు తెలిపారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago