సరళీకృత విధానాల వల్ల దేశానికి పెను ముప్పు

Districts politics Telangana

– ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

– ఇంటీ జాగా ఉన్న వారికీ ప్రభుత్వం 5లక్షలు ఇవ్వాలి

_సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు

మనవార్తలు , పటాన్ చెరు:

మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న సరళీకృత విధానాల వల్ల దేశానికి పెను ముప్పుగా పరిణమించాయని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి రాజు మండిపడ్డారు.శుక్రవారం పట్టణంలోని శ్రామిక్ భవన్ లో జరిగిన సిపిఎం పటాన్ చెరు నియోజకవర్గం స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభం కు జయరాజ్ మాట్లాడుతూ దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మిన ఘనకీర్తి మోడీకే దక్కిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే దేశ సంపద, ప్రజల సొత్తన్నారు వాటిని స్వదేశీ విదేశీ బహుళజాతి కంపెనీలకు అమ్మేస్తున్నాడని అంబానీ, ఆదాని వంటి బడాబాబులు తప్ప ఈ దేశంలో ఉన్న కోట్లను కోట్ల మంది ప్రజలు మోడీకి కనిపించడం లేదని ఆరోపించారు. కార్మిక హక్కులను కాలరాస్తూ యాజమాన్యాలకు ఊడిగం చేసే లేబర్ కోర్డ్ లను తీసుకొచ్చిండని అన్నారు.

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కంటే ఘోరంగా దేశాన్ని దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు కష్టాలు దోపిడీదారులకు సుఖాలు ఇది మోడీ పాలన అని అన్నారు. ప్రజా ఉద్యమాలతో మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది ఏళ్లు పూర్తయిందని, ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. ఇంటీ జాగా ఉన్న పేదలకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ను అర్హులైన పేదలకు ఇవ్వాలని డిమాడ్ చేశారు.

కమ్యూనిస్టుల తోనే ప్రజలకు మేలు అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేశాయని ప్రజా ఉద్యమాలతో గుణపాఠం తప్పదనిప్రజా సమస్యలపై సమరశీల పోరాటాల కు కార్యకర్తలు సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి జయరాజ్,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నాయిని నరసింహారెడ్డి, పటాన్ చెరు సిపిఎం నాయకులు పాండు రంగారెడ్డి,నాగేశ్వరరావు,యన్ శ్రీనివాస్, సత్తిబాబు, వెంకట్ రామ్ రెడ్డి, ప్రసాద్, జార్జ్,విష్ణు,మని రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *