పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతమ్ ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం! ప్రతి ఒక్క పౌరుడూ తమ ఇంటి వద్దే తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా ఉండేలా చర్యలు చేపట్టాలని, కానీ,దురదృష్టవశాత్తు మనదేశంలో కనీసం 20 శాతం నుంచి కూడా దీనిని ఆచరించడం లేదని అరబిందో ఫార్మా లిమిటెడ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్-పర్యావరణం డాక్టర్ బీ.ఎన్. మూర్తి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ని, రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ‘ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మూర్తి మాట్లాడుతూ, తడి, పొడి చెత్తను ప్రజలంతా వేర్వేరు.డబ్బాలతో వేయడం ప్రారంభించాలని, తడి వ్యర్థాలను ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం మానేయాలని డాక్టర్ మూర్తి హితవు పలికారు. వ్యర్థ ఆహారాన్ని ప్యాక్ చేసి, సీలు వేయడం వల్ల అది బాగా క్షీణిస్తుందని, దాని నుంచి ప్లాస్టిక్ పదార్థాన్ని వేరుచేయడం కష్టమని ఆయన చెప్పారు. ఈ వ్యర్థాలు నీటిలో చేరి, అవి వినియోగించడానికి నీల్లేకుండా మారడంతో పాటు పర్యావరణానికి చేటు చేస్తోందన్నారు.
తెలంగాణలోని చాలా నీటివనరులు కనీసం స్నానం చేయడానికి కూడా పనిరాని విధంగా తయారయ్యాయని ఆయన విచారం నెలిబుచ్చారు. నీరు, పారిశుధ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి, మార్పును వేగవంతం చేయడానికి ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని, ఎందుకంటే నీరు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుందని, నూర్పు ప్రతి ఒక్కరిలో వచ్చి నివారణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అరబిందో పరిశ్రమలో ఆచరిస్తున్న వ్యర్థాల నివారణ చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు.తొలుత, స్కూల్ ఆఫ్ సెర్చ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష్ ప్రారంభోపన్యాసం చేసి, అతిథిని సర్కరించగా, కార్యక్రను నిర్వాహకురాలు డాక్టర్ ఆర్.సిసూదేవి నందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులంగా నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు. గోడపత్రికల రూపకల్పన, ముఖ చిత్ర లేఖనం వంటి పలు పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…