మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్ చెరు పట్టణానికి చెందిన సీసాల రాజు ప్రతి ఏటా నిర్వహించే తిరుపతి పాదయాత్రను మంగళవారం ఉదయం పటాన్ చెరు శాసనసభ్యులకు మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పటాన్ చెరు పట్టణంలోని మహంకాళి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏటా శ్రావణ మాసంలో సీసాల రాజు వారి బృంద్ధాన్ని పూలమాల వేసి,శాలువాతో సత్కరించచారు అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా చేపట్టిన తిరుపతి వరకు పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాదయాత్ర దిగ్విజయవంతం కావాలని ఆయన కోరారు.

అనంతరం సీసాల రాజు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో తాను ఏ స్థాయికి ఎదిగానని ,ఎల్లప్పుడూ ఆ వేంకటేశ్వరుడు ప్రజలను చల్లగా చూడాలని ఈ పాదయాత్ర చేప్పట్టనని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
