మనవార్తలు, శేరిలింగంపల్లి :
ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఎదురు వ్యాపారులు, నిరుద్యోగులకు అండగా ముద్ర లోన్స్ అందిస్తామని యూనియన్ బ్యాంక్ మేనేజర్ విజయ్ యాదవ్ అన్నారు. మియపూర్ లో స్థానిక యువకుడు చాకలి రాజు ఏర్పాటు చేసిన షాప్ ను ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ నిరుద్యోగులు, చిరువ్యాపారులు వీటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని, వాయిదాలు సక్రమంగా చెల్లించాలని సూచించారు. బ్యాంక్ లకు సక్రమంగా వాయిదాలు చెల్లించినట్లయితే మరిన్ని లోన్లు అందిస్తామని తెలిపారు. ఇతరులపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడుతూ ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్ట్రీట్ వెండర్స్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్, బంజారా నాయకుడు దశరథ్ నాయక్, నదిగడ్డ తాండ ప్రధాన కార్యదర్శి రత్నాకర్, మల్లేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.