అమీన్పూర్ లో అట్టహాసంగా సమ్మక్క సారక్క జాతర
మనవార్తలు ,అమీన్పూర్
ప్రపంచంలోని అతి పెద్ద గిరిజన జాతర మహోత్సవం గా పేరొందిన సమ్మక్క సారక్క జాతర తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బందం కొమ్ము లో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క సారక్క జాతర మహోత్సవంలో భాగంగా బుధవారం మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బోనం, జాతర కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ ప్రజల కోసం బంధం కొమ్ములో సమ్మక్క-సారక్క జాతరను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవార్లను దర్శించుకుంటున్నారనీ తెలిపారు. జోగిని శ్యామల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనం ఊరేగింపు అందరినీ అలరించింది. ఈ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, యాదగిరి యాదవ్, రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…